National Cricket Academy: జాతీయ క్రికెట్‌ అకాడమీలో కార్పొరేట్‌ క్లాస్‌

రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని జాతీయ క్రికెట్‌ అకాడమీ తన కోచింగ్‌ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మైదానం వెలుపలి సమస్యల పరిష్కారానికి సంబంధించి వర్ధమాన కోచ్‌ల కోసం కార్పొరేట్‌

Updated : 23 Aug 2021 08:14 IST

దిల్లీ: రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) తన కోచింగ్‌ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మైదానం వెలుపలి సమస్యల పరిష్కారానికి సంబంధించి వర్ధమాన కోచ్‌ల కోసం కార్పొరేట్‌ క్లాసులు కూడా కొత్త విధానంలో భాగం. ఇటీవలే పలువురు మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు బీసీసీఐ లెవెల్‌-2 కోచింగ్‌ కోర్సుకు హాజరయ్యారు. థియరీ, ప్రాక్టీస్‌ పరీక్షలు పూర్తి చేశారు. మైదానం బయటి   క్రికెట్‌ సంబంధీకులతో వ్యవహారాల్లో ఎదురయ్యే సమస్యలకు  పరిష్కారాలను వాళ్లను అడిగారు. ‘‘ముంబయి మాజీ సీమర్‌ క్షేమల్‌ ఈ కోర్సు రూపకర్త. అతడు ఎంబీఏ చేశాడు. కార్పొరేట్‌ నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి క్లాసుకు ఇంతకుముందెప్పుడూ హాజరు కాలేదు. కానీ ఇది చాలా విలక్షణమైంది. నాకెంతో ఉపయోగపడింది’’ అని కోర్సుకు హాజరైన ఓ మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ చెప్పాడు. జట్టు ఎంపికకు సంబంధించి వివిధ వర్గాల నుంచి వచ్చే ఒత్తిళ్ల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పారని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని