Gymnastics: జిమ్నాస్టిక్స్‌.. బికినీలతోనే ఎందుకు? 

జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో మహిళలు బికినీలతో పోటీపడడం సాధారణమే.

Updated : 26 Jul 2021 09:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో మహిళలు బికినీలతో పోటీపడడం సాధారణమే. కానీ మహిళా జిమ్నాస్ట్‌లంటే కేవలం బికినీలే ధరించాలా? పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులు వేసుకోకూడదా? అనే ప్రశ్నలకు సమాధానంగా జర్మనీ అమ్మాయిలు ఒలింపిక్స్‌లో పూర్తిగా దుస్తులు ధరించి పోటీపడ్డారు. దాని వెనక ఓ కారణం ఉంది. బికినీలు వేసుకుని జిమ్నాస్టిక్స్‌ చేసే అమ్మాయిలపై లైంగిక వేధింపులు పెరగడంతో పాటు వాళ్లను వేరే దృష్టితో చూడడం ఎక్కువైంది. అందుకే దీనికి అడ్డుకట్ట వేయడం కోసమే ఆ దేశ జిమ్నాస్ట్‌లు ఇలా పూర్తి దుస్తులతో విన్యాసాలు చేశారు. ఈ దుస్తుల్లోనూ తాము అందంగా కనిపిస్తామని అందరికీ చాటి చెప్పేందుకే ఈ ప్రయత్నమని 21 ఏళ్ల జర్మనీ జిమ్నాస్ట్‌ సారా తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని