Team India: టీమ్‌ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయి: చోప్రా

టీమ్‌ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ శర్మ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను...

Published : 20 Dec 2021 12:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాలో పరిస్థితులు మారిపోతున్నాయని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ శర్మ స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను జట్టు యాజమాన్యం వైస్‌ కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజులూ ఆ బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానె ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. మరోవైపు రాహుల్‌ త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ వైస్‌కెప్టెన్‌గా ఎంపికవుతాడని చోప్రా బలంగా నమ్ముతున్నాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ముందు రోహిత్‌ గాయపడటంతో.. అతడి స్థానంలో రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్నాడు. మరోవైపు రోహిత్‌ ఇటీవలే పూర్తిగా పరిమిత ఓవర్ల సారథ్యం చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్‌ త్వరలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికవుతాడని అనుకుంటున్నా. రాహుల్‌ క్లిక్‌ అయితే, టెస్టుల్లో అజింక్య రహానె స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. అజింక్య గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ చేశాడు. అలాంటిది ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గానూ చోటు కోల్పోయాడు. దీంతో టీమ్‌ఇండియాలో పరిస్థితులన్నీ మారిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని