
IND vs NZ: హనుమ విహారి ఏం తప్పు చేశాడు.. అతడిని ఎందుకు తీసుకోలేదు?
సెలెక్టర్ల తీరుపై అజయ్ జడేజా అసహనం
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారిని న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు కాకుండా ఇండియా-ఏ తరఫున దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సెలెక్టర్లపై మండిపడ్డాడు. కివీస్‌తో ఈనెల 25 నుంచి భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆపై డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే విహారిని సెలెక్టర్లు.. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే ఇండియా- ఏ పర్యటనకు ఎంపిక చేశారు. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన జడేజా సెలెక్టర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
‘విహారిని తలచుకుంటే బాధేస్తుంది. కొంత కాలంగా టీమ్ఇండియాతో పర్యటిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నాడు. అతడేం తప్పు చేశాడు? ఇండియా-ఏ జట్టుతో ఎందుకు వెళ్లాలి? స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఎందుకు ఆడకూడదు? అది కుదరకపోతే ఇండియా-ఏ పర్యటనకు కూడా పంపకూడదు. ఇన్ని రోజులూ జట్టుతో కలిసి ఉన్న ఆటగాడు ఇప్పుడు ఇండియా-ఏ తో ఆడుతుంటే.. మరోవైపు జట్టులో కొత్త కుర్రాళ్లు వచ్చి ఆడుతుండటం లాంటివి క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తాయి’ అని జడేజా చెప్పుకొచ్చాడు.
కాగా, విహారిని న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా అతడిని ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు పంపారు. మరోవైపు అతడు చివరిసారి టీమ్ఇండియాకు ఆడింది గత ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన సిడ్నీ టెస్టులో. ఆ మ్యాచ్‌లో జట్టును ఓటమి నుంచి తప్పించడానికి అశ్విన్ (39; 128 బంతుల్లో 7x4)తో కలిసి విహారి (23; 161 బంతుల్లో 4x4) రాణించాడు. గాయం బారిన పడినా సుదీర్ఘంగా బ్యాటింగ్ చేశాడు. చివరికి మ్యాచ్‌ను డ్రాగా ముగించి సిరీస్ కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. గాయంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదు.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
- Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..