Team India: రవిశాస్త్రి అలాంటి వార్తలేం పట్టించుకోడు: అగార్కర్

రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తొలగిపోయి కొత్త వ్యక్తి ఆ బాధ్యతలు చేపడతాడని ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందించాడు...

Published : 24 Aug 2021 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తొలగిపోయి కొత్త వ్యక్తి ఆ బాధ్యతలు చేపడతాడని ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందించాడు. ఈ విషయాన్ని అటు టీమ్‌ఇండియా కానీ, ఇటు కోచ్‌ రవిశాస్త్రి కానీ అస్సలు పట్టించుకోరని చెప్పాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మీడియం పేసర్‌.. భారత జట్టు కోచ్‌ మార్పు విషయంపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఎవరు ఏది రాసినా, ఏది చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని తెలిపాడు. దీని గురించి రవిశాస్త్రి ఆందోళన చెందడని వివరించాడు.

‘ఈ వార్తల గురించి రవిశాస్త్రి ఆందోళన చెందడని అనుకుంటున్నా. టీమ్‌ఇండియా కూడా అస్సలు పట్టించుకోదని అనిపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్నారు. నాటింగ్‌హామ్‌లో వర్షం పడకపోతే 2-0తో నిలిచేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్‌ మార్పుపై రవిశాస్త్రి అస్సలు ఆలోచనే చేయడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత రవి ఒప్పందం పూర్తవుతుంది. ఒకవేళ టీమ్‌ఇండియా బాగా ఆడుతూ విజయాలు సాధిస్తుంటే కోచ్‌ మార్పు అనేది క్లిష్టమైన నిర్ణయం అవుతుంది. ఆ వ్యక్తిని తీయాలా వద్దా అనేది జట్టు విజయాలపైనే ఆధారపడుతుంది’ అని అగార్కర్‌ పేర్కొన్నాడు. కాగా, ఇటీవల ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటనకు కోచింగ్‌ బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచి ఈ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తర్వాతి హెడ్‌కోచ్‌ అతడే అని చాలా మంది విశ్వసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు