Ashes Series: అరంగేట్రంలోనే పంత్‌ రికార్డు బద్దలుకొట్టిన ఆలెక్స్‌ కేరీ

ఆస్ట్రేలియా నూతన టెస్టు వికెట్‌ కీపర్‌ ఆలెక్స్‌ కేరీ అరంగేట్రం టెస్టులోనే చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా కీపర్‌ రిషభ్‌పంత్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌...

Published : 12 Dec 2021 08:51 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా నూతన టెస్టు వికెట్‌ కీపర్‌ ఆలెక్స్‌ కేరీ అరంగేట్ర టెస్టులోనే చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా కీపర్‌ రిషభ్‌పంత్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌కు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ తప్పుకోవడంతో కేరీ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రిస్బేన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతడు మొత్తం 8 క్యాచ్‌లు అందిపుచ్చుకొని అరంగేట్ర టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు ఈ రికార్డు పంత్‌ (7) పేరిట ఉంది.

పంత్‌తో సమానంగా ఏడు క్యాచ్‌లు అందుకున్న ఇతర ఆటగాళ్లు

క్రిస్‌రీడ్‌ (ఇంగ్లాండ్‌)

బ్రియన్‌ టేబర్‌ (ఆస్ట్రేలియా)

చమర దుసింగె (శ్రీలంక)

పీటర్‌ నెవిల్‌ (ఆస్ట్రేలియా)

అలన్‌నాట్‌ (ఇంగ్లాండ్‌)

ఇక దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ శ్రీలంకతో జరిగిన ఒక టెస్టులో మొత్తం 9 క్యాచ్‌లు అందుకోగా అది అతడి అరంగేట్రం కాకపోవడం గమనార్హం. అంతకుముందే డికాక్‌ ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేయగా ఆ మ్యాచ్‌లో డివిలియర్స్‌ కీపర్‌ బాధ్యతలు చేపట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని