Avani Lekhara: 19 ఏళ్లకే దిగ్గజం.. అవని అద్భుతం.. ఒకే పారాలింపిక్స్‌లో 2 పతకాలు

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. మహిళల షూటింగ్‌ ఎస్‌హెచ్‌1

Updated : 03 Sep 2021 12:35 IST

టోక్యో: పారా షూటర్‌ అవనీ లేఖరా.. అద్భుతం చేసింది. 19 ఏళ్లకే దిగ్గజంగా మారింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో ఆమె కాంస్య పతకం గెలిచింది.

రైఫిల్‌ 3 పొజిషన్స్‌ అర్హత పోటీల్లో అవని 1176 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఫైనల్లో ఆమె నువ్వా నేనా అన్నట్టు పోటీపడింది. మొత్తంగా 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒక సిరీసులో ఒక షాట్‌లో 9.9 స్కోరు చేయడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో ఆమె పారాలింపిక్స్‌ రికార్డు స్కోరుతో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.

పారాలింపిక్స్‌లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు గెలిచిన ఏకైక భారత వనితగా అవని అవతరించింది. అంతకు ముందు జోగిందర్‌ సింగ్‌ సోధి 1984 పారాలింపిక్స్‌లో ఒక రజతం, రెండు కాంస్యాలు అందుకున్నాడు. షాట్‌పుట్‌లో రజతం, డిస్కస్‌, జావెలిన్‌ త్రోలో కాంస్యాలు గెలిచాడు. కాగా జావెలిన్‌ త్రోలో దేవేంద్ర జజారియా మూడు పతకాలు గెలిచినప్పటికీ.. ఒకే టోర్నీలో సాధించలేదు. వేర్వేరు పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఈ సారి రజతం అందుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని