Tokyo Olympics: పతక రేసులో భజరంగ్‌.. సెమీస్‌కు దూసుకెళ్లిన రెజ్లర్‌

భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ భజరంగ్‌ పునియా తిరుగులేని ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకానికి చేరువ అవుతున్నాడు. 65 కిలోల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు....

Updated : 06 Aug 2021 13:42 IST

టోక్యో: భారత అగ్రశ్రేణి రెజ్లర్‌ భజరంగ్‌ పునియా తిరుగులేని ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకానికి చేరువ అవుతున్నాడు. 65 కిలోల విభాగంలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మోర్తజాను 2-1 తేడాతో ఓడించాడు. పిన్‌డౌన్‌ సాయంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 4:46 నిమిషాల్లోనే పోరు ముగించాడు. సెమీస్‌లో అజర్‌ బైజాన్‌కు చెందిన అలియెవ్‌ హజీతో తలపడనున్నాడు. అతడు ఒలింపిక్స్‌ విజేతే కాకుండా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ గెలిచాడు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రొ రెజ్లింగ్‌లో అతడిని భజరంగ్‌ ఓడించాడు.

మొదటి పిరియడ్‌లో ఇద్దరు ఆటగాళ్లూ హోరాహోరీగా తలపడ్డారు. ఉడుం పట్టు బిగించారు. దాదాపుగా రక్షణాత్మకంగా ఆడారు. దాంతో మోర్తజా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో రౌండ్లోనూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. భజరంగ్‌ కాళ్లను పట్టేసుకున్న మోర్తజా పాయింట్లు సాధించేలా కనిపించాడు. కానీ అతడి ఆటలను భజరంగ్‌ సాగనివ్వలేదు. ప్రతిదాడిచేసి అడ్డుకున్నాడు. టచ్‌డౌన్‌ చేసి రెండు పాయింట్లు సాధించాడు. సాంకేతికంగా మెరుగ్గా ఆడే భజరంగ్‌ సమయం దొరకగానే ప్రత్యర్థిని రింగులో పడేసి పిన్‌డౌన్‌ చేశాడు. సెమీసుకు దూసుకెళ్లాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని