Tokyo Olympics: విజేతలకు బీసీసీఐ నగదు నజరానా.. నీరజ్‌కు ₹కోటి

టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు బీసీసీఐ శనివారం సాయంత్రం నగదు నజరానా ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్‌ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించారు...

Published : 07 Aug 2021 21:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు బీసీసీఐ శనివారం సాయంత్రం నగదు నజరానా ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్‌ చేస్తూ ఆ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఏకైక స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాకు కోటి రూపాయలు బహుమతిగా ప్రకటించారు. రజతం సాధించిన మీరాబాయి చాను, రవి దాహియాకు చెరో అర కోటి ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే కాంస్య పతకాలు సాధించిన బజరంగ్‌ పూనియా, లవ్లీనా బార్గోహేన్‌, పీవీ సింధుకు తలా రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల నగదు నజరానా ప్రకటించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని