Brett Lee : కొడుకుపైనా దయ చూపని మాజీ ఫాస్ట్‌బౌలర్‌ బ్రెట్‌లీ

పాతతరం ఫాస్ట్‌బౌలర్లలో బ్రెట్‌లీ ఒకడు. తన అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేసిన...

Published : 01 Jan 2022 15:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మునుపటి తరం ఫాస్ట్‌బౌలర్లలో బ్రెట్‌లీ ఒకడు. తన అద్భుతమైన డెలివరీలతో బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్‌ చేసిన సందర్భాలు ఎన్నో.. నిర్దయగా వికెట్ల వేట సాగించేవాడు. అలాంటి బ్రెట్‌లీ పదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేసి కామెంటేటర్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన బౌలింగ్‌ ప్రతిభను ప్రదర్శించాడు. అయితే ఏ జట్టు మీదనో అనుకోకండి.. సరదాగా కుమారుడు ప్రెస్టోన్‌తో క్రికెట్‌ ఆడుతూ బౌలింగ్‌ వేశాడు. అప్పుడు ప్రత్యర్థులను తన బౌలింగ్‌తో దెబ్బకొట్టినట్లే... ఇప్పుడు కుమారుడిపై కూడా ఏమాత్రం కనికరం లేకుండా యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రెట్‌లీ సోదరుడు, మాజీ క్రికెటర్‌ షేన్‌లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పాపం.. బౌల్డ్‌ అయిన ప్రెస్టోన్‌ బ్యాట్‌ను విసిరేసిన దృశ్యం అందులో కనిపిస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు