
Sourav Ganguly: గంగూలీకి జరిమానా విధించిన కోల్‌కతా హైకోర్టు..
ఇంటర్నెట్‌డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కోల్‌కతా హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. కోల్‌కతా సమీపంలో ఓ పాఠశాల భవనం నిర్మాణం కోసం గంగూలీకి స్థానిక అధికారులు అక్రమ పద్ధతుల్లో భూమి కేటాయించారని కోల్‌కతా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తాజాగా తేల్చింది. ఈ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వంతో పాటు హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సైతం చెరో రూ.50వేల జరిమానా విధించింది.
దాదాకు 2009లో బెంగాల్ ప్రభుత్వం స్టాల్‌లేక్‌లో ప్లాట్ కేటాయించగా 2011లో సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేసింది. ఆ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసింది. అయితే, 2013లో బెంగాల్ ప్రభుత్వం మళ్లీ కోల్‌కతా సమీపంలో గంగూలీకి రెండెకరాల భూమి కేటాయించగా దీనిపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సుప్రీంకోర్టు కొట్టివేసిన నిబంధనల కింద మళ్లీ భూమి కేటాయించినందుకు దాదాతో పాటు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్ బోర్డు కార్పొరేషన్‌లకు జరిమానా విధించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.