Dale Steyn Retirement: పేస్‌ బౌలింగ్‌లో అతనొక్కడు.. స్టెయిన్‌పై ప్రశంసల జల్లు

దక్షిణాఫ్రికా పేస్‌ దిగ్గజం, యార్కర్ల వీరుడు డేల్‌ స్టెయిన్‌ రిటైర్మెంట్‌పై పలువురు క్రికెటర్లు, మాజీలు స్పందించారు. క్రికెట్‌లో అరుదైన వ్యక్తి అని కొనియాడుతున్నారు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో వందల వికెట్లు తీసిన అతడు మంగళవారం...

Updated : 31 Aug 2021 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా పేస్‌ దిగ్గజం, యార్కర్ల వీరుడు డేల్‌ స్టెయిన్‌ రిటైర్మెంట్‌పై పలువురు క్రికెటర్లు, మాజీలు స్పందించారు. క్రికెట్‌లో అరుదైన వ్యక్తి అని కొనియాడుతున్నారు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో వందల వికెట్లు తీసిన అతడు మంగళవారం అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన యార్కర్లతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను సైతం స్టెయిన్‌ గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడి బౌలింగ్‌ను గుర్తుచేసుకుంటూ పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లతో సహా ఇంకొందరు అతడికి సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపారు.

* గో వెల్‌ గ్రేట్‌ మ్యాన్‌. నువ్వు బౌలింగ్‌ చేసేటప్పుడు నిప్పులు చెరిగేవాడివి. క్రికెట్‌ చూసిన గొప్ప ఆటగాళ్లలో నువ్వూ ఒకడివి.   -సెహ్వాగ్‌

* స్టెయిన్‌ నీ అత్యద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. నువ్వు సాధించినదానికి మిక్కిలి గర్వపడొచ్చు. నీ రెండో ఇన్నింగ్స్‌ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా.  -వీవీఎస్‌

* నా ఆల్‌టైమ్ ఫేవరేట్‌ క్రికెటర్ మీరు. మీకంతా మంచే జరగాలి.   -హార్దిక్‌ పాండ్య

* ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ కన్నా మేటి బౌలర్‌ లేడు. త్వరలోనే నిన్ను కలుస్తా దిగ్గజం.     -కెవిన్‌ పీటర్సన్‌

డేల్‌.. నీ కెరీర్‌ ఎంత అద్భుతమైనది..! ఎన్నోసార్లు నా ఆఫ్‌స్టంప్‌ను ఎగరగొట్టినందుకు ధన్యవాదాలు.     -మైఖేల్‌ వాన్‌

* మీలాంటి అరుదైన కెరీర్‌కు శుభాభినందనలు. సుమారు 20 ఏళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాస్ట్‌ బౌలర్లకు ఒక ప్రేరణగా నిలిచారు. మీలాంటి యాక్షన్‌ బౌలింగ్‌ ఎవరికీ లేదు.    -పాట్‌ కమిన్స్‌

* గొప్ప ఆటగాడు. మనసున్న మంచోడు. ఎప్పటికి గుర్తుండే మధుర జ్ఞాపకాలు మిగిల్చావు.    -ఏబీ డివిలియర్స్‌

* అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అది మైదానమైనా, బయటైనా.. ఎక్కడైనా ఒక్కటే.   -మహేలా జయవర్దెనె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని