Daniil Medvedev: శ్రీమతికి ప్రేమతో... మెద్వెదేవ్ కానుక
యూఎస్ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు షాకిచ్చిన ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ ఆదివారం తన సతీమణికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు...
సతీమణిపై ప్రేమ చాటుకున్న యువ సంచలనం
ఇంటర్నెట్‌డెస్క్: యూఎస్ ఓపెన్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు షాకిచ్చిన ప్రపంచ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ ఆదివారం తన సతీమణికి అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. జకోవిచ్‌తో తలపడిన తుదిపోరులో డానిల్ 6-4, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే రోజు అతడికి మూడో వివాహ వార్షికోత్సవం కూడా. అలా వివాహ వార్షికోత్సవం రోజున యూఎస్ ఓపెన్ టైటిల్ కొట్టి సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అందుకునేటప్పుడు ఈ రష్యా ఆటగాడు తన విజయంలో సతీమణి డారియా సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని తెలిపాడు. ఆమెను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటానని అన్నాడు. కాగా, అక్కడే ఉంటూ ఈ మాటలు విన్న డారియా భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
‘నా భార్య డారియా ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ నాపై నమ్మకంతో ఉంటుంది. నేను టాప్ 10లో ఉంటానని అంటుండేది. ఒకవేళ నేను ఏదీ సాధించలేనని ఆమె చెబితే అందులో ఏదో లోపం ఉందని అర్థం. అలా తను నాకు పూర్తి మద్దతు ఇస్తుంది. తనంటే నాకెంతో ఇష్టం. డారియాతో ఉండాలంటే మరీ మరీ ఇష్టం. ఇంతకుమంచి నేనేమీ చెప్పలేను. ఈ టోర్నీ జరుగుతున్నంత కాలం ఆమెకు ఏ బహుమతి ఇవ్వాలనేదాని గురించి అస్సలు ఆలోచించలేదు. నేను ఫైనల్‌కు చేరాక.. ఒకవేళ ఇక్కడ ఓడితే ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా. ఈ విజయంతో బహుమతి ఇచ్చా. మరోవైపు నాకు వేరే సమయం కూడా లేకపోయింది. ఇది నాకు తప్పుక గెలవాల్సిన మ్యాచ్‌గా అనిపించింది. ఐ లవ్యూ దారియా, థాంక్స్ ఎలాట్’ అంటూ మెద్వెదేవ్ తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ఇక ఈ తుదిపోరులో గెలిచాక మెద్వెదేవ్ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. ఒంట్లో ఉన్న శక్తినంతా కోల్పోయి ఉన్నట్టుండి కిందపడిపోయినట్లు నటించాడు. అయితే, అది కూడా ఒక సెలబ్రేషన్ అని, దాన్ని ఫుట్‌బాల్‌లో చేసుకుంటారని తెలిపాడు. ఇదివరకు వింబుల్డన్ గెలిస్తే ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నట్లు అతనన్నాడు. అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడిలా చేసినట్లు వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్‌గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM