IPL 2021: లోపాలు సరిదిద్దుకున్నాం.. జడేజా అలా ఆడితే ఏం చేయగలం?
ఐపీఎల్ 14వ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడిన సందర్భంగా ఉత్కంఠకర పరిస్థితుల్లో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది...
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ పరిస్థితుల్లో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది. దీపక్ చాహర్ సింగిల్ తీసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో చెన్నై పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్‌లోకి దూసుకెళ్లి 16 పాయింట్లతో కొనసాగుతోంది. దిల్లీ తర్వాత ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాట్లాడుతూ ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
‘ఇది చాలా అద్భుతమైన విజయం. క్రికెట్లో కొన్నిసార్లు బాగా ఆడి మ్యాచ్‌ను కోల్పోతాం. మరికొన్ని సార్లు బాగా ఆడకపోయినా గెలుపొందుతాం. ఇలాంటప్పుడు ఇంకాస్త ఎక్కువ ఆనందం ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా అద్భుతమైన మ్యాచ్ జరిగింది. కోల్‌కతా కూడా బాగా ఆడటంతో అభిమానులు మంచి ఆటను ఆస్వాదించారు. ఇక ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. అబుదాబిలో ఉక్కపోత తీవ్రత ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్ బౌలర్లకు అంత తేలికకాదు. అందుకే వారితో ఒకటి, రెండు ఓవర్ల స్పెల్స్ వేయించాం. అయితే, ఈ వికెట్‌పై 170 పరుగులనేవి మంచి స్కోరే. ఈ విజయానికి కోల్‌కతా జట్టు కూడా అర్హమైనదే. ఇక మా జట్టులో లోపాలను సరిదిద్దుకున్నామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఇలా వరుస విజయాలు సాధించడం బాగుంది’ అని ధోనీ వివరించాడు.
జడేజా అలా ఆడితే ఏం చేయగలం: మోర్గాన్
‘రెండు జట్లూ అద్భుతంగా ఆడినా చెన్నై విజయం సాధించింది. అయితే, ఈ రోజు మా ఆటలో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మావాళ్లందరూ గెలిచేందుకు చాలా కష్టపడ్డారు. దురదృష్టం కొద్దీ ఓటమిపాలయ్యాం. రెండో దశలో మా జట్టు సానుకూలంగా ఆడుతోంది. ఈరోజు ఆటలో అలాంటి పరిణామాలనే ఎంచుకొని తర్వాతి మ్యాచ్‌ల్లో రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇక సునీల్ నరైన్ ఏ జట్టు మీదైనా రాణించడానికి సిద్ధంగా ఉంటాడు. అతడి కన్నా మెరుగైన ఆటగాడు దొరకడు. మరోవైపు ఈ టోర్నీలో చాలా మంది నైపుణ్యమున్న ఆటగాళ్లు ఉన్నారు. అందులో కొందరు భారత యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిలాగే ఆడితే టీమ్ఇండియాకు ప్రాతినధ్యం వహించే అవకాశం ఉంది. ఇక చెన్నై జట్టులోని రవీంద్ర జడేజా.. ఇంగ్లాండ్ ఆటగాడు సామ్కరన్లా ఆడితే ఏమీ చేయలేం. మా స్పిన్నర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు’ అని మోర్గాన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్‌ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్‌కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్‌ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్‌లో 12.5, రెండో వాల్ట్‌లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్‌లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?