Published : 08/12/2021 18:21 IST

Australia Open : ఆస్ట్రేలియా ఓపెన్‌ బరిలోకి జకోవిచ్‌.. గాయంతో సెరెనా దూరం

ఇంటర్నెట్‌ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెన్‌లోకి ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ బరిలోకి దిగనున్నాడు. అయితే మహిళల ఛాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ గాయంతో గైర్హాజరు కానుంది. జనవరి 17 నుంచి 30వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. ఈ మేరకు లిస్ట్‌ను ఆస్ట్రేలియా ఓపెన్‌ నిర్వాహకులు విడుదల చేశారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్స్‌ స్టేటస్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. టెన్నిస్‌ ఆస్ట్రేలియా కమిటీ నిబంధనల ప్రకారం.. ఎంట్రీ లిస్ట్‌లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వనుంది. 

కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్‌ గతవారం మాత్రం ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనడంపై స్పష్టత ఇవ్వలేదు. త్వరలో చెబుతానని సమాధానం దాటవేశాడు. అయితే టెన్నిస్‌ సంఘం విడుదల చేసిన లిస్ట్‌లో జకోవిచ్‌ పేరు ఉండటంతో బరిలోకి దిగడం ఖరారైనట్లేనని తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి వివరాలను జకోవిచ్‌ ఇంతవరకు ఇవ్వలేదు. సిడ్నీలో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యాక్సినేషన్‌ నుంచి జకోవిచ్‌కు మినహాయింపు ఇచ్చినా.. కనీసం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. మరోవైపు కాలి గాయంతో గత వింబుల్డన్‌లో మొదటి రౌండ్‌లోనే తిరుగుముఖం పట్టిన సెరెనా విలియమ్స్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ పాల్గొనడం లేదు. గాయం తిరగబెట్టడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పురుషుల టైటిల్‌ కోసం జకోవిచ్‌, నాదల్‌తో సహా 108 మంది, మహిళల టైటిల్‌ కోసం 104 మంది పోటీపడనున్నారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని