INDvsENG: ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని.. మోయిన్‌ అలీకి పిలుపు

టీమ్‌ఇండియాతో తలపడే రెండో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు తమ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీని పిలిపించింది. దాంతో అతడు మంగళవారం నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేయనున్నాడు...

Updated : 11 Aug 2021 06:06 IST

లండన్‌: టీమ్‌ఇండియాతో తలపడే రెండో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు తమ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీని పిలిపించింది. దాంతో అతడు మంగళవారం నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేయనున్నాడు. అలీ ప్రస్తుతం ‘ది హండ్రెడ్‌ లీగ్‌’లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం నుంచి లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగే రెండో టెస్టుకు అతడిని తిరిగి పిలిపించారు. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రాణించకపోవడంతో ఆల్‌రౌండర్‌ జాబితాలో అలీని తిరిగి జాతీయ జట్టుకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఇలాగే సరైన ప్రదర్శన చేయకపోతే కచ్చితంగా జట్టులో మార్పు ఉంటుందని కోచ్‌ సిల్వర్‌వుడ్‌ ఇదివరకే స్పష్టం చేశాడు.

మరోవైపు సోమవారం మీడియాతో మాట్లాడిన సిల్వర్‌వుడ్‌.. మోయిన్‌ అలీ ఎప్పటికీ తమ ఫేవరెట్‌ ప్లేయర్‌ అని, అతనెప్పుడూ జట్టులో కొనసాగుతాడని చెప్పాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టుకు అతడిని మళ్లీ పిలిపించనున్నట్లు పేర్కొన్నాడు. అతడో మేటి ఆటగాడని, ప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నాడని సిల్వర్‌వుడ్‌ చెప్పుకొచ్చాడు. తమ జట్టులో బెన్‌స్టోక్స్‌, క్రిస్‌వోక్స్‌ లాంటి ఆటగాళ్లు ఆల్‌రౌండర్ల జాబితాలో సరిపోతారని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ అందుబాటులో లేరని ఆయన అన్నారు. కాగా, అలీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో చివరిసారి రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఆడాడు. ఆ తర్వాత అతడు రొటేషన్‌ పద్ధతిలో భాగంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. మరోవైపు చివరిసారి స్వదేశంలో టెస్టు ఆడింది మాత్రం 2019 యాషెస్‌ సిరీస్‌లో. ఆ తర్వాత మోయిన్‌ అలీ ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్‌ ఆడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని