Published : 18/08/2021 01:45 IST

Geoffrey Boycott: షమి, బుమ్రాను గాయపర్చాలని తామే దెబ్బతిన్న ఇంగ్లాండ్‌.. చెత్త వ్యూహాలంటూ జెఫ్రీ విమర్శలు

లండన్‌: లార్డ్స్‌ టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లాండ్‌ను మాజీ క్రికెటర్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ తీవ్రంగా విమర్శించాడు. టీమ్‌ఇండియా పోరులో జోరూట్‌ సేన తమ చెత్త వ్యూహాలతో తెలివి తక్కువగా ప్రవర్తించిందని ఘాటుగా అన్నాడు. ఓటమి నుంచి బయటపడి మ్యాచ్‌ గెలిచిన కోహ్లీసేనను ప్రశంసించాడు.

ఈ టెస్టులో టీమ్‌ఇండియా 151 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రెండు జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకోగా.. భారతీయులు కసిగా ఆడి విజయం సాధించారు. ఆంగ్లేయులు మాత్రం పక్కదారి పట్టారు.

‘ఈ టెస్టు మ్యాచ్‌ రెండు విషయాలను స్పష్టం చేసింది. మొదటిది తెలివి తక్కువగా ప్రవర్తిస్తే టెస్టుల్లో విజయానికి అర్హులు కారు. జో రూట్‌ బ్యాటింగ్‌ను మనం ఎంత ప్రేమించినా అతడు చెత్త వ్యూహాలు అమలు చేశాడు. ఇక రెండోది, ఇంగ్లాండ్‌ పూర్తిగా పరుగుల కోసం జో రూట్‌ మీదే ఆధారపడింది. అతి త్వరగా టాప్-3 మెరుగవ్వాలి. ఎందుకంటే ఇదొక జోక్‌గా మారిపోయే అవకాశం ఉంది’ అని బాయ్‌కాట్‌ అన్నాడు.

జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇంగ్లాండ్‌ ఫీల్డర్లను దూరంగా మోహరించింది. దీంతో ఈ ఇద్దరు పేసర్లు తమ బ్యాటింగ్‌తో 89 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఛేదనకు దిగిన ఆంగ్లేయులను 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసేశారు.

‘మొదట్లో రూట్‌ ఫీల్డర్లను బాగానే మోహరించాడు. జస్ప్రీత్‌ బుమ్రా క్రీజులోకి రాగానే వెర్రిగా  ఆవేశపడ్డాడు. బుమ్రాకు షార్ట్‌ బంతులు వేసేలా మార్క్‌వుడ్‌ను ప్రోత్సహించాడు. అండర్సన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా చేసిందానికి ప్రతీకారంగానే రూట్‌, ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ఇలా చేశారు. ఔట్‌ చేయడానికి బదులుగా షమి, బుమ్రాను గాయపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారు కీలకమైన పరుగులు చేసి డిక్లేర్‌ చేయగానే అవమానపడ్డారు. ఆట ఆరంభంలో ఇంగ్లాండే ఫేవరెట్‌. వారిలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఏదేమైనా టీమ్‌ఇండియాకు అభినందనలు’ అని బాయ్‌కాట్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని