IND vs SA: మీకిది తెలుసా..? సెంచూరియన్‌లో పుజారా‘డబుల్‌ గోల్డెన్‌’

దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా (0) గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. సెంచూరియన్‌ వేదికగా సూపర్‌ స్పోర్ట్‌ మైదానంలో జరుగుతున్న...

Updated : 27 Dec 2021 12:02 IST

రెండుసార్లూ ఔట్‌ చేసింది ఎంగిడీనే..

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా (0) గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. సెంచూరియన్‌ వేదికగా సూపర్‌ స్పోర్ట్‌ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో ఆదివారం అతడు ఎంగిడి బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే కీగన్‌ పీటర్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఇదే మైదానంలో రెండుసార్లూ ఎంగిడీ చేతిలోనే గోల్డెన్‌ డకౌట్‌గానే వికెట్‌ కోల్పోవడం గమనార్హం. ఇంతకుముందు 2018 పర్యటనలోనూ పుజారా ఇదే వేదికపై జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఎంగిడి చేతిలో రనౌటయ్యాడు.

మరోవైపు పుజారా ఈ మ్యాచ్‌లో పరుగులేమీ చెయ్యకుండా ఔటవ్వడంతో ఓ అనవసరపు రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌లో మూడో నంబర్‌ ఆటగాడిగా అత్యధికంగా తొమ్మిది సార్లు డకౌటైన ఆటగాడిగా నిలిచాడు. మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌ ఇదివరకు ఇలా ఎనిమిది సార్లు ఔటవ్వగా, ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఏడు సార్లు డకౌటై ఈ అనవసరపు రికార్డులో భాగమయ్యారు. అలాగే దక్షిణాఫ్రికా పర్యటనల్లో టీమ్‌ఇండియా మూడో నంబర్‌ ఆటగాళ్లుగా సంజయ్‌ మంజ్రేకర్‌ (1992), సౌరభ్‌ గంగూలీ (1996) డకౌటయ్యారు. ఈ జాబితాలో పుజారా రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఇక పుజారా ఇటీవల సరైన ప్రదర్శన చేయలేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్యటనలో రాణించకపోతే ఇదే అతడికి చివరి సిరీస్‌ అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలోనూ ఇలా విఫలమవ్వడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడిని తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉండేది కాదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇకనైనా ఈ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాణిస్తాడో లేదో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు