
Gambhir on KL Rahul: మనమింకా రాహుల్ అసలైన ఆట చూడలేదు: గంభీర్
ఇంటర్నెట్‌డెస్క్: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ అసలైన బ్యాటింగ్ మనమింకా చూడలేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అతడు ఈ టీ20 లీగ్‌లో పరుగులు తీస్తున్నా ఇంకా ఏం సాధించగలడో చూడలేదని ఓ క్రీడా ఛానెల్‌తో చెప్పాడు. కోహ్లీ 2016లో ఆడినట్లు రాహుల్ కూడా అలా ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడని అంచనా వేశాడు. పొట్టి ఫార్మాట్‌లో అతడు 2, 3 సెంచరీలు సాధించగలడని ధీమా వ్యక్తం చేశాడు.
ఇక ఐపీఎల్ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులు ముంబయి ఇండియన్స్‌కు ఉపయోగపడతాయని తెలిపాడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్లు తమ స్వింగ్‌తో చెలరేగుతారని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఆ జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారని గుర్తుచేశాడు. ఇప్పటికే టోర్నీలో నాలుగో స్థానంలో నిలిచిన రోహిత్ జట్టు ఇకపై జరిగే ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఐదు గెలవాలన్నాడు. దాంతో మిగిలిన మ్యాచ్‌లను తేలిగ్గా తీసుకోదని వివరించాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు సవాళ్లు ఎదురవుతాయని మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, మరోవైపు డివిలియర్స్ ఇటీవల కాలంలో క్రికెట్ ఆడలేదని గుర్తుచేశాడు. దాంతో వీరిద్దరికీ కష్టతరమవుతుందని గంభీర్ పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.