India vs Srilanka: హాయ్‌ పృథ్వీ! నీ బ్యాటింగ్‌ బాగుంది

యువ ఓపెనర్‌ పృథ్వీషా పాదాల కదలిక చాలా బాగుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. ఇప్పుడు బంతిని చక్కగా ఆడగలుగుతున్నాడని ప్రశంసించాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 24 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని కొనియాడాడు. ...

Updated : 20 Jul 2021 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ ఓపెనర్‌ పృథ్వీషా పాదాల కదలిక చాలా బాగుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. ఇప్పుడు బంతిని చక్కగా ఆడగలుగుతున్నాడని ప్రశంసించాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 24 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని కొనియాడాడు. పృథ్వీషాకు ఛాపెల్‌ ఓ లేఖ రాశాడని తెలిసింది.

‘హాయ్‌ పృథ్వీ! శ్రీలంకపై నువ్వాడిన ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ చూశాను. ఇప్పుడు నీ పాదాల కదలిక మరింత బాగుంది. దీంతో ఎక్కువ బంతులు ఆడేందుకు అవకాశం దొరుకుతోంది. ప్రత్యేకించి ఫుల్‌ లెంగ్త్‌ బంతులు బాగా ఆడగలుగుతున్నావు. ఇప్పుడున్న స్థితిలో బ్యాటు స్వింగ్‌ సైతం మెరుగ్గా ఉంది’ అని ఛాపెల్‌ అన్నాడు.

‘బౌలర్‌ బంతి వదిలేటప్పుడు నీ బ్యాటింగ్‌ పొజిషన్‌ బాగుంటోంది. నువ్వు 22 పరుగుల వద్ద కొట్టిన బౌండరీని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ముందుగానే నువ్వు బంతిని అంచనా వేయగలుగుతున్నావు. దాంతో ప్రమాదకరమైన ఫుల్‌లెంగ్త్ బంతులను బాదేస్తున్నావు. ఎప్పుడైతే బ్యాట్స్‌మన్‌ అలాంటి బంతులను శిక్షిస్తారో  బౌలర్లు లెంగ్త్‌ మార్చుకుంటారు. అప్పుడు బ్యాక్‌ఫుట్‌తో ఆడే సౌకర్యం లభిస్తుంది’ అని ఛాపెల్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని