కిషన్‌, షాను విస్మరించలేం: భజ్జీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఇషాన్‌ కిషన్‌, పృథ్వీషాను విస్మరించలేమని టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. వారిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు....

Published : 21 Jul 2021 01:12 IST

సూర్యకుమార్‌కు ప్రపంచకప్‌లో చోటు ఖాయమే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఇషాన్‌ కిషన్‌, పృథ్వీషాను విస్మరించలేమని టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. వారిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు. 360 డిగ్రీల్లో ఆడే సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఖాయమేనని అంచనా వేశాడు. శ్రీలంకతో రెండో వన్డేకు ముందు భజ్జీ మీడియాతో మాట్లాడాడు.

‘ప్రదర్శనల ఆధారంగానే ఆటగాళ్లపై నిర్ణయం తీసుకుంటారు. అంతర్జాతీయ మ్యాచులో ఇషాన్‌ కిషన్‌, పృథ్వీ షా బ్యాటింగ్‌ చూస్తే వారి సామర్థ్యమేంటో అర్థమవుతుంది. టీ20 ప్రపంచకప్‌ జట్టులో వారిని విస్మరించలేం. మనం ప్రపంచకప్‌ గెలవాలంటే అలాంటి క్రికెటర్లే అవసరం. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరని వారు చూడరు. తమ సహజ ఆటతీరుకే ప్రాధాన్యమిస్తారు’ అని భజ్జీ అన్నాడు.

ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కూ ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమే అంటున్నాడు భజ్జీ. ‘ఐసీసీ ప్రపంచకప్‌నకు ఈ కుర్రాళ్ల ప్రదర్శనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా సీనియర్‌ ఆటగాడి స్థానం భర్తీ చేయాలన్నా సెలక్టర్లు వీరివైపే చూడాల్సి ఉంటుంది. నేనైతే సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమనే అనుకుంటున్నా. అతడు కేవలం దూకుడుగా ఆడటమే కాదు వికెట్‌నూ నిలుపుకొంటాడు. అదే సమయంలో వేగంగా పరుగులు చేస్తాడు’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని