Hardik Pandya: వాళ్లు పట్టుకోలేదు.. నేనే చూపించా!

తాను దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన ఖరీదైన వాచీలను ముంబయి కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేసినట్లుగా వచ్చిన వార్తలను టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఖండించాడు. దుబాయ్‌

Updated : 17 Nov 2021 08:19 IST

ముంబయి: తాను దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన ఖరీదైన వాచీలను ముంబయి కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేసినట్లుగా వచ్చిన వార్తలను టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఖండించాడు. దుబాయ్‌ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన వస్తువులన్నింటినీ తనే స్వయంగా కస్టమ్స్‌ అధికారులకు చూపించి, వాటికి చెల్లించాల్సిన పన్నును కూడా కట్టేసినట్లు అతను వెల్లడించాడు. ‘‘నా దగ్గరున్న వాచ్‌ ధర దాదాపు రూ.1.5 కోట్లు. ప్రచారం జరుగుతున్నట్లు రూ.5 కోట్లు కాదు. నవంబరు 15న దుబాయ్‌ నుంచి రాగానే నేను నా సామగ్రి తీసుకుని నేరుగా కస్టమ్స్‌ కౌంటర్‌ దగ్గరికి వెళ్లాను. నేను కొన్న వస్తువులన్నీ చూపించి కస్టమ్స్‌ డ్యూటీ కట్టేశాను. ముంబయి విమానాశ్రయంలో ఏదో జరిగిందంటూ వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చేందుకే ఈ వివరణ ఇస్తున్నా’’ అని హార్దిక్‌ ట్విటర్లో తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని