Tokyo Olympics: బజరంగ్‌ పునియాకు రూ. 2.5కోట్ల నగదు బహుమతి

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ బజరంగ్‌ పునియాకు హరియాణా ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. రూ. 2.5కోట్ల రివార్డుతో పాటు ప్రభుత్వ

Published : 07 Aug 2021 18:20 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ బజరంగ్‌ పునియాకు హరియాణా ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. రూ. 2.5కోట్ల రివార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. 

శనివారం జరిగిన కాంస్య పోరులో బజరంగ్‌ పతకం గెలవడంపై ఖట్టర్‌ సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. బజరంగ్‌ కేవలం పతకం మాత్రమే గెలవలేదని, యావత్‌ భారతావని మనసులు గెలుచుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా అతడికి రూ. 2.5కోట్ల నగదు బహుమతితో పాటు అతడి స్వస్థలమైన ఖుందన్‌ గ్రామంలో ఇండోర్‌ స్టేడియంను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అంతేగాక, 50శాతం రాయితీతో ప్లాట్‌ను కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతకుముందు తన ఆఫీస్‌లో బజరంగ్‌ కుస్తీ పట్టును వీక్షిస్తున్న ఫొటోను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో హరియాణా నుంచి పాల్గొన్న ప్రతి అథ్లెట్‌కు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఖట్టర్‌ శుక్రవారం ప్రకటించారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు