Cricket Australia : ఆసీస్‌ క్రికెట్‌లో హాట్‌ టాపిక్‌.. ‘ముగ్గురు కోచ్‌’ల వ్యవహారం

టెస్టులు, వన్డేలు, టీ20లకు వేర్వేరుగా కోచ్‌ల నియామకం.. కొత్త ప్రయోగానికి ఆస్ట్రేలియా క్రికెట్‌..

Published : 27 Dec 2021 01:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టులు, వన్డేలు, టీ20 జట్లకు వేర్వేరుగా కోచ్‌ల నియామకం.. కొత్త ప్రయోగానికి ఆస్ట్రేలియా క్రికెట్‌ సన్నాహాలు చేస్తోందా...? ఇప్పుడిదే అక్కడి క్రికెట్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. వీటికి బలం చేకూరేలా క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్‌ నిక్ హాక్లే ఇవాళ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. వేర్వేరు ఫార్మాట్లకు కోచ్‌లను విభజించవచ్చని సూచించాడు. అలానే ప్రస్తుతమున్న ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్ అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగుతాడా? లేదా అనేదానికి మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.  ప్రధాన కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ వరకు ఉంది. ఈ క్రమంలో లాంగర్‌ను టెస్టులకే పరిమితం చేసి వన్డేలు, టీ20 జట్లకు మైకెల్‌ డివెంటో, ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

లాంగర్‌ తన పదవీకాలం ముగిసేవరకు (వచ్చే ఏడాది జూన్) వరకు ప్రధాన కోచ్‌గా ఉండాడని నిక్ హాక్లే తెలిపారు. ‘‘వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై ఇప్పుడే ఆలోచించట్లేదు. అయితే ప్రస్తుత క్రీడా సీజన్‌ ముగిసేలోపు చర్చిస్తాం. అలానే జస్టిన్‌ లాంగర్‌ కాంట్రాక్ట్‌ ముగిసేవరకూ అతడే ప్రధాన కోచ్‌. అందులో మరో ప్రశ్నకు తావులేదు. యాషెస్‌ సిరీస్‌ ముగిశాక.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై మాట్లాడుకుంటాం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని