Cricket news: పాక్‌ జట్టులో క్రికెటర్ల కన్నా రెజ్లర్లే ఎక్కువ!

పాకిస్థాన్‌ జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజర్లు కనిపిస్తున్నారని మాజీ పేసర్‌ ఆఖిబ్‌ జావెద్‌ ఎద్దేవా చేశాడు. ఏ స్థానంలో ఎవరు ఆడతారో, వారి పాత్రలేంటో తెలియడం లేదని పేర్కొన్నాడు. సరైన ఎంపిక విధానం, ప్రణాళిక లేదని ..

Published : 17 Jul 2021 01:06 IST

మాజీ క్రికెటర్‌ తీవ్ర విమర్శలు

కరాచీ: పాకిస్థాన్‌ జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజర్లు కనిపిస్తున్నారని మాజీ పేసర్‌ ఆఖిబ్‌ జావెద్‌ ఎద్దేవా చేశాడు. ఏ స్థానంలో ఎవరు ఆడతారో, వారి పాత్రలేంటో తెలియడం లేదని పేర్కొన్నాడు. సరైన ఎంపిక విధానం, ప్రణాళిక లేదని సెలక్టర్లు, జట్టు యాజమాన్యాన్ని విమర్శించాడు. గతంలో పాక్‌ అండర్‌-19 జట్టుకు ఆఖిబ్‌ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. సీనియర్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ సేవలు అందించాడు.

‘ఎందుకు ఆడుతున్నారో? ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారో వారికే తెలియదు. నాకైతే పాక్‌ టీ20 జట్టులో క్రికెటర్ల కన్నా ఎక్కువగా రెజ్లర్లే కనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో షర్జీల్‌ ఖాన్‌, ఆజమ్‌ ఖాన్‌, షోయబ్‌ మక్సూద్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు కలుగుతున్నాయి’ అని ఆఖిబ్‌ అన్నాడు.

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రదర్శనల ఆధారంగా షోయబ్‌ను టీ20 జట్టులోకి ఎంపిక చేశారని ఆఖిబ్‌ విమర్శించాడు. అతడిని ఏ స్థానంలో ఆడించాలో వారికే అర్థం కావడం లేదన్నాడు.

‘పాక్‌ జట్టును పరిశీలిస్తే ఒకే స్వభావం కలిగిన అనేక మంది ఒక స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇలాగేనా ముందుకు వెళ్లే పద్ధతి? ఇంగ్లాండ్‌ను చూడండి. కొత్త వాళ్లతో ఆడినా ఒక దార్శనికతతో ముందుకు సాగింది. అన్ని పరిస్థితుల్లోనూ మంచి రన్‌రేట్‌ కొనసాగించింది. విజయాలు అందుకుంది’ అని వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని