ICC Dog of the Month: ‘డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌’గా శునకానికి ఐసీసీ అవార్డు

ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్‌కు కాదు ఓ శునకానికి కావడం గమనార్హం...

Updated : 14 Sep 2021 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి నెలా క్రికెటర్లకు అవార్డులను ఇచ్చే ఐసీసీ ఈసారి ఓ ప్రత్యేక పురస్కారం ప్రకటించింది. ఆ అవార్డు దక్కింది క్రికెటర్‌కు కాదు ఓ శునకానికి కావడం గమనార్హం! ఐర్లాండ్‌లో తాజాగా ఒక టీ20 మ్యాచ్‌ జరుగుతుండగా మధ్యలోకి ఓ శునకం దూసుకొచ్చి.. బంతిని నోట కరుచుకుని మైదానంలో పరుగులు పెట్టింది. చివరికి అది బంతిని తీసుకెళ్లి బ్యాటర్‌కు ఇచ్చేసింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఐసీసీ దాన్ని చూసి.. ఇప్పుడా శునకానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆ కుక్క బంతిని నోట కరుచుకుని టోపీ పెట్టుకున్న ఫొటోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఈ విషయాన్ని తెలియజేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని