Published : 12 Dec 2021 01:22 IST

Olympics: ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌.. మేం ఆశలు వదులుకోలేదు: ఐసీసీ 

జెనీవా: లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్స్‌ ప్రాథమిక జాబితాలో క్రికెట్‌ పేరు లేకపోవడంపై ఎలాంటి నిరాశకు గురికాలేదని అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) వెల్లడించింది. గత ఆగస్టు నుంచి 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ఒలింపిక్స్ కమిటీ విడుదల చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఐసీసీ తాజాగా స్పందించింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై తమకు ఇంకా ఆశలు ఉన్నాయని పేర్కొంది. ‘అదనపు స్పోర్ట్స్’ విభాగంలో క్రికెట్‌ చేర్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ‘‘ఆతిథ్యం నగరం (లాస్‌ఏంజెలెస్‌) అదనపు క్రీడలను ఎంచుకునే ప్రక్రియ 2023 నుంచి ప్రారంభమవుతుంది. అప్పుడు క్రికెట్‌ కూడా భాగం కావాలని కోరుతున్నాం. అయితే క్రికెట్‌ను అదనపు క్రీడగా చేర్పించడం కఠిన సవాలే. ఇప్పటికైతే ఎలాంటి హామీ ఇవ్వలేం. గత ఆగస్టులో క్రికెట్‌ను కూడా చేర్చాలని కోరాం. దీనికి బీసీసీఐ మద్దతు కూడా మాకు ఉంది’’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు వెల్లడించారు. 

ఇప్పటికైతే ఐవోసీ స్థానం కల్పించకపోయినా.. ఆట పట్ల ప్రాచుర్యం, యువతలో క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో క్రికెట్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ‘‘ దాదాపు వంద కోట్లకుపైగా అభిమానులు క్రికెట్‌ సొంతం. అందులో 90 శాతం వరకు క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడాలని కోరుతున్నారు. సుదీర్ఘ కాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే క్రికెట్‌ను చేర్చాలని ఐవోసీకి విన్నవించాం’’ అని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్ బార్‌క్లే తెలిపారు. ఆతిథ్యం ఇచ్చే లాస్‌ఏంజెలెస్‌కు అదనపు క్రీడలను ఒలింపిక్స్‌లో ఎంట్రీ చేయించే అవకాశం ఉంది. బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ అదనపు స్పోర్ట్ష్ కింద చేర్చొచ్చు. ఈ క్రమంలో క్రికెట్‌ను కూడా యాడ్‌ చేయించాలనేది ఐసీసీ ప్రయత్నం. 

ఐవోసీ ప్రధాన ఆటల జాబితాను మాత్రమే విడుదల చేస్తూ ఉంటుంది. ఈసారి బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్‌కూ ప్రాథమిక జాబితాలో లభించలేదు. తమ స్థానాలను కాపాడుకోవడానికి ఆయా సంఘాలకు 2023 వరకు ఐవోసీ గడువునిచ్చింది. ఈ లిస్ట్‌ను బీజింగ్‌ వేదికగా జరిగే సమావేశాల్లో అప్రూవల్‌ కోసం ఐవోసీ ఓటింగ్‌ నిర్వహిస్తుంది. దీంతో క్రికెట్‌ను లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో చూస్తామో లేదో.. తెలియాలంటే వేచి ఉండక తప్పదు. 1900 పారిస్‌ క్రీడల్లో క్రికెట్‌ క్రీడను చేర్చారు. ఆ తర్వాత ఎప్పుడూ స్థానం దక్కలేదు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని