Published : 07 Sep 2021 22:55 IST

Ajinkya Rahane: రహానెకు మరో ఛాన్స్‌ వస్తే అదృష్టమే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానెకు ఐదో టెస్టులో చోటు దొరికితే అదృష్టమేనని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, హనుమ విహారి జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. ఒకప్పుడు తనను తప్పించడం వల్లే రాహుల్‌ ద్రవిడ్‌కు చోటు దొరికిందని గుర్తు చేసుకున్నాడు.

ఇంగ్లాండ్‌ సిరీసులో అజింక్య రహానె నాలుగు టెస్టులు ఆడాడు. 15.57 సగటుతో 109 పరుగులే చేశాడు. లార్డ్స్‌ రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు మినహాయిస్తే మిగతా ఇన్నింగ్సుల్లో 5, 1, 18, 10, 14, 0తో విఫలమయ్యాడు. దాంతో అతడి స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

‘జట్టులో ఇతరులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇలాంటివి తప్పవు. భారత క్రికెట్‌ను ఇలాగే చూడాల్సి ఉంటుంది. జట్టులోంచి నన్ను తప్పించకపోతే రాహుల్‌ ద్రవిడ్‌ వంటి క్రికెటర్లు వచ్చేవారు కాదు. హనుమ విహారి, సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం రిజర్వు బెంచీపై ఉన్నారు. వారికీ అవకాశాలు ఇవ్వాలి. పైగా ఇప్పుడు రహానె ఆత్మవిశ్వాసంతో లేడు’ అని మంజ్రేకర్‌ అన్నాడు.

రహానెకు మరో మ్యాచ్‌లో అవకాశం వచ్చిందంటే అదృష్టమేనని సంజయ్‌ తెలిపాడు. నిజానికి భారత జట్టుతో అతడు సుదీర్ఘ ప్రయాణం చేశాడని పేర్కొన్నాడు. పాత తరంతో పోలిస్తే అతడికి ఎక్కువ అవకాశాలే వచ్చాయని వెల్లడించాడు. అతడు మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. ఏదో ఒక ఇన్నింగ్సులోనైనా పుంజుకుంటాడని భావిస్తున్నా అలా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని