IND vs ENG: రెండు మార్పులతో భారత్‌.. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్

మరికాసేపట్లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు...

Updated : 02 Sep 2021 15:24 IST

లండన్‌: మరికాసేపట్లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇప్పటికే ఇరు జట్లూ చెరో మ్యాచ్‌ గెలవడంతో సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. మరోవైపు గత మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఇక్కడ ఎవరు గెలిస్తే వారు సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్తారు. ఈ క్రమంలోనే భారత్‌ నాలుగో టెస్టులో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఉమేశ్‌ యాదవ్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి రాగా ఇషాంత్‌, మహ్మద్‌ షమికి విశ్రాంతినిచ్చారు. అలాగే ఈ మ్యాచ్‌లోనైనా సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని ఆశించినా అదీ జరగలేదు. అతడిని మరోసారి రిజర్వ్‌బెంచ్‌కే పరిమితం చేసి జడేజాను తీసుకోవడం గమనార్హం.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శార్ధూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు:  రోరీబర్న్స్‌, హసీబ్‌ హమీద్‌, డేవిడ్‌ మలన్‌, జోరూట్‌(కెప్టెన్‌), ఒలీపోప్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, క్రేగ్‌ ఓవర్టన్‌, ఒలీ రాబిన్‌సన్‌, జేమ్స్‌ అండర్సన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని