
IND vs ENG: ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్.. శతకం దిశగా పోప్
లండన్: టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓలీపోప్(74*) శతకం దిశగా సాగుతూ ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ రెండో రోజు రెండో సెషన్ పూర్తయ్యేసరికి 227/7తో నిలిచింది. అతడికి క్రిస్‌వోక్స్(4*) తోడుగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆధిక్యం 36 పరుగులుగా నమోదైంది. మూడో సెషన్‌లో భారత్ వీలైనంత త్వరగా మిగతా మూడు వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఈ సెషన్‌లో 28 ఓవర్ల ఆట జరగ్గా 88 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(37) వికెట్ల ముందు దొరికిపోగా జడేజా బౌలింగ్‌లో మొయిన్ అలీ(35)ని రోహిత్ క్యాచ్ అందుకున్నాడు. వీరిద్దరితో పోప్ విలువైన భాగస్వామ్యాలు జోడించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.