Updated : 07/12/2021 14:18 IST

IND vs SA: ‘దక్షిణాఫ్రికా పర్యటనలో అశ్విన్‌ను పక్కనపెట్టినా ఆశ్చర్యపోను’

హార్మిసన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను పక్కనపెట్టి.. ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానెను ఆడించినా ఆశ్చర్యపోనని ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ అన్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయినా, అతడిని కాదని టీమ్‌ఇండియా ఆ సిరీస్‌లో ఎంపిక చేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అశ్విన్‌ ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినా ఇంగ్లాండ్‌ పర్యటనలో జట్టు యాజమాన్యం పక్కనపెట్టిందని హార్మిసన్‌ గుర్తుచేశాడు.

జట్టు ఎంపికలో కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయాలే కీలకమని, అతడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఎవరూ ఊహించలేరని పేర్కొన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అయ్యర్‌, అగర్వాల్‌ శతకాలు బాదారు. దీంతో వారిద్దరూ ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లొచ్చని అనుకోవచ్చు. అలాగే రహానె, పుజారాను తుది జట్టులోకి తీసుకున్నా.. అశ్విన్‌ను పక్కనపెట్టినా.. నేను ఆశ్చర్యపోను’ అని ఇంగ్లాండ్‌ మాజీ అభిప్రాయపడ్డాడు. అలాగే జడేజా కీలక ఆటగాడని, అక్షర్‌, అశ్విన్‌ లాంటి స్పిన్నర్లు బ్యాటింగ్‌ చేయగలిగినా జడేజానే ఏడో స్థానంలో సరైన బ్యాట్స్‌మన్‌ అని హార్మిసన్‌ వివరించాడు. కాకపోతే.. అశ్విన్‌ కచ్చితంగా తుది జట్టులో ఉండాలన్నాడు. అతడు సీమ్‌ బౌలర్లకు ఏమాత్రం తక్కువ కాదని, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్‌ఇండియా కచ్చితంగా ఆడించాలని ఇంగ్లాండ్‌ మాజీ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని