
IND vs NZ: ముంబయిలో పుట్టి.. ముంబయిలోనే చరిత్ర సృష్టించావు
కివీస్ స్పిన్నర్‌కు అభినందనల వెల్లువ
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పది వికెట్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమ్‌ఇండియాతో పాటు పలువురు మాజీలు సైతం సామాజిక మాధ్యమాల్లో అజాజ్‌కు అభినందనలు తెలిపారు. 22 ఏళ్ల క్రితం రెండోసారి ఈ ఘనత సాధించిన భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సైతం అజాజ్‌ను ప్రశంసిస్తూ అభినందించాడు. పది వికెట్ల క్లబ్‌లోకి స్వాగతం పలికాడు. మాజీ కోచ్ రవిశాస్త్రితో పాటు వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, ఆరోన్ ఫించ్, వీరేందర్ సెహ్వాగ్ తదితరులు మెచ్చుకున్నారు.
* పర్‌ఫెక్ట్ 10 వికెట్ల క్లబ్‌లోకి స్వాగతం. అజాజ్ గొప్పగా బౌలింగ్ చేశావు. ఒకటి లేదా రెండో రోజు ఈ ఘనత సాధించడం గొప్ప విషయం. ఇకపై నీ మీద అంచనాలు మరింత పెరుగుతాయి. నీ నుంచి ఇకపై ఇలాంటి ప్రదర్శనలే ఆశిస్తారు. -అనిల్‌కుంబ్లే
* పది వికెట్ల క్లబ్‌లో చేరడం గొప్ప విశేషం. ఆటాడే వారిలో 99శాతం మందికి సాధ్యంకానిది నువ్వు చేసి చూపించావు అజాజ్. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడం అనేది చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. -అశ్విన్
* అజాజ్ ఇది నువ్వెప్పటికీ గుర్తుంచుకుంటావు. 47.5-12-119-10 ఈ గణంకాలు సింప్లీ ఔట్‌స్టాండింగ్. నీ గొప్ప ప్రదర్శనకు నేను నిలబడి చప్పట్లు కొడుతున్నా. -హర్భజన్‌సింగ్
* క్రికెట్‌లో అత్యంత కష్టమైన రికార్డుల్లో ఇదీ ఒకటి. ఒకే ఇన్నింగ్స్‌లో జట్టు మొత్తాన్ని ఔట్ చేయడం అనేది ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. ఒక విధంగా ఇది నమ్మశక్యంకానిది. చాలా బాగా బౌలింగ్ చేశావ్ యంగ్‌మ్యాన్. -రవిశాస్త్రి
* ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడం అనేది బౌలర్ల కల. ఈ ఘనత సాధించినందుకు అజాజ్ నీకు ప్రత్యేక అభినందనలు. జిమ్‌లేకర్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజాల సరసన నిలిచావు. అది కూడా నువ్వు పుట్టిన గడ్డపైనేసాధించడం. నిజంగా అత్యద్భుతం. -వీవీఎస్ లక్ష్మణ్
* ఇది నిజంగా వండర్‌ఫుల్.. వండర్‌ఫుల్ ఘనత. నీ ప్రదర్శనకు మంత్రముగ్ధుడినయ్యా అజాజ్. -హర్షా భోగ్లే
* క్రికెట్‌లో అత్యంత కష్టమైన రికార్డు ఇది. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించడం అనేది నీ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఇది నిలిచిపోతుంది. ముంబయిలో పుట్టి.. ముంబయిలోనే చరిత్ర సృష్టించావు. ఈ గొప్ప ప్రదర్శనకు అభినందనలు. -వీరేందర్ సెహ్వాగ్
* అజాజ్ పుట్టిన గడ్డపైనే ఎవరూ ఊహించని ప్రదర్శన చేశాడు. వెల్‌డన్ అజాజ్. -దినేశ్ కార్తీక్
* కంగ్రాట్యులేషన్స్ అజాజ్. ఫీట్‌ను చూసేందుకు చాలా ముచ్చటగా ఉంది. నువ్వు రికార్డు అర్హుడివి. అంతేకాకుండా నీతోపాటు కివీస్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు గొప్ప అనుభూతిని ఇచ్చే సందర్భం - సర్ రిచర్డ్ హ్యాడ్లీ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.