Virat Kohli: ఇంతకుముందు చెప్పినట్లే.. కోహ్లీనే ‘ది బెస్ట్‌’: ఇర్ఫాన్‌

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ‘ది బెస్ట్‌’ టెస్టు కెప్టెన్‌ అని మాజీ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కొనియాడాడు. తాజాగా భారత్‌ రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 372 పరుగుల భారీ తేడాతో అత్యంత...

Published : 07 Dec 2021 14:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ‘ది బెస్ట్‌’ టెస్టు కెప్టెన్‌ అని మాజీ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కొనియాడాడు. తాజాగా భారత్‌ రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 372 పరుగుల భారీ తేడాతో అత్యంత ఘన విజయం సాధించిన నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. ఈ విజయంతో కోహ్లీసేన స్వదేశంలో వరుసగా 14 టెస్టు సిరీస్‌లు గెలుపొందిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలోనే ఇర్ఫాన్‌ కోహ్లీని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు.

‘నేను ఇంతకుముందు చెప్పాను.. ఇప్పుడూ అదే విషయాన్ని చెబుతున్నా. భారత జట్టు చరిత్రలో కోహ్లీ అంతటి గొప్ప సారథి ఎవరూ లేరు. అతడు 59.09 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు’ అని పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ ఈ ఏడాది విపరీతమైన క్రికెట్‌ ఆడటంతో టీ20 ప్రపంచకప్‌ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులోనూ ఆడలేదు. అనంతరం ముంబయిలో జరిగిన రెండో టెస్టులో పాల్గొని జట్టును గెలిపించాడు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే కుప్పకూలినా ఫాలో ఆన్‌ ఆడించకుండా మళ్లీ టీమ్‌ఇండియానే బ్యాటింగ్‌ చేసేలా చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు బ్యాటింగ్‌లో పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న వారికి కాస్త ప్రాక్టీస్‌ దొరుకుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాడు. చివరికి టీమ్‌ఇండియా విజయం సాధించి టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని