IND vs NZ: న్యూజిలాండ్‌పై జైత్రయాత్ర.. టీమ్‌ఇండియా అదిరిపోయే రికార్డులు..!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించగా పలు ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. అందులో కొన్ని భారత జట్టు సాధించగా మరికొన్ని రవిచంద్రన్ అశ్విన్ సాధించాడు...
12 టెస్టు సిరీస్‌ల్లో ఒక్కటీ గెలవలేకపోయిన కివీస్
ముంబయి: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించగా పలు ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. అందులో కొన్ని భారత జట్టు సాధించగా మరికొన్ని రవిచంద్రన్ అశ్విన్‌వి ఉన్నాయి. ఒక్కటి మాత్రం కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ నెలకొల్పాడు. అవేంటో ఓ లుక్కేద్దాం.
పరుగుల పరంగా భారత్‌కిదే అత్యంత భారీ విజయం..
* 372: 2021లో ముంబయి వేదికగా న్యూజిలాండ్‌పై (ఈ మ్యాచ్‌లోనే)
* 337: 2015లో దిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో.
* 321: 2016లో ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడిన వేళ.
* 320: 2008లో మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు.
ఈ టెస్టు సిరీస్‌లో నమోదైన రికార్డులివే..
* ఈ ఏడాది అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య 52కి చేరుకుంది. టెస్టుల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కిది నాలుగో సారి. 2015, 2016, 2017, 2021లో ఈ ప్రదర్శన చేసిన అశ్విన్.. అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇదివరకు హార్భజన్, కుంబ్లే 3 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. దీంతో ఆ ఇద్దరి దిగ్గజాలను అశ్విన్ ఇప్పుడు వెనక్కినెట్టాడు.
* న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఇప్పటివరకు అశ్విన్ తీసిన వికెట్లు 66. రెండు జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్.. కివీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ రిచర్డ్ హ్యాడ్లీ(65)ని అశ్విన్ అధిగమించాడు.
* ఈ మ్యాచ్‌లో కివీస్ స్పిన్నర్ అజాజ్ బౌలింగ్ గణాంకాలివి 14/225. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గానూ అతడు నిలిచాడు. కివీస్ తరపున టెస్టుల్లో అతడికిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు.
* భారత్‌లో న్యూజిలాండ్ ఆడిన 12 టెస్టు సిరీస్‌ల్లో ఒక్కసారి కూడా సిరీస్ కైవసం చేసుకోలేదు. చివరిసారిగా ఆ జట్టు 1988లో వాంఖడే మైదానంలోనే ఒక టెస్టు గెలిచింది.
* భారత్‌కు ఇది స్వదేశంలో వరుసగా 14వ టెస్టు సిరీస్ విజయం.
భారత్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆటగాళ్లలో అశ్విన్..
* 350 అనిల్‌కుంబ్లే
* 300 రవిచంద్రన్ అశ్విన్
* 265 హర్భజన్ సిగ్
* 219 కపిల్ దేవ్
స్వదేశాల్లో టెస్టుల్లో వేగంగా 300 వికెట్ల క్లబ్‌లో చేరిన ఆటగాళ్లలో అశ్విన్..
* 48 మ్యాచ్‌ల్లో ముత్తయ్య మురళీధరన్ తొలి స్థానంలో నిలిచాడు.
* 49 మ్యాచ్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్ ఆ ఘనత సాధించి రెండో స్థానం.
* 52 మ్యాచ్‌ల్లో అనిల్‌కుంబ్లే మూడులో నిలిచాడు.
* 65 మ్యాచ్‌ల్లో షేన్‌వార్న్ నాలుగో స్థానం.
* 71 మ్యాచ్‌ల్లో జిమ్మీ ఆండర్సన్ ఐదులో ఉన్నాడు.
* 76 మ్యాచ్‌ల్లో స్టువర్ట్‌బ్రాడ్ ఆరో స్థానంలో నిలిచాడు.
మ్యాచ్‌లో ఓటమిపాలైనా అత్యంత మేటి బౌలింగ్ ప్రదర్శనలో అజాజ్ టాప్
* 14/225: 2021లో భారత్‌పై అజాజ్ పటేల్ నంబర్ వన్
* 13/132: 1999లో పాకిస్థాన్‌పై జవగళ్ శ్రీనాథ్
* 13/163: 1902లో ఆస్ట్రేలియాపై సిడ్నీ బార్న్స్
* 13/217: 1988లో వెస్టిండీస్‌పై మెర్వ్ హ్యూస్
* 13/244: 1896లో ఆస్ట్రేలియాపై టామ్ రిచర్డ్స్
పరుగుల పరంగా న్యూజిలాండ్‌కిదే అత్యంత భారీ ఓటమి
* 372: 2021లో భారత్‌తో తలపడిన మ్యాచ్‌లో.
* 358: 2007లో జోహెనస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడినప్పుడు.
* 321: 2016లో భారత్‌తో ఆడినప్పుడు.
* 299: 2001లో ఆక్లాండ్‌లో పాకిస్థాన్‌తో ఆడిన వేళ.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం