IND vs NZ: టీమ్‌ఇండియా తీరుకు ఆశ్చర్యపోయా: షేన్‌వార్న్‌

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు చివరి సెషన్‌లో టీమ్‌ఇండియా తీరుకు స్పిన్‌ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ షేన్‌ వార్న్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు...

Updated : 30 Nov 2021 15:00 IST

అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేకపోయింది

ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు చివరి సెషన్‌లో టీమ్‌ఇండియా తీరుకు స్పిన్‌ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ షేన్‌ వార్న్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సోమవారం ఐదోరోజు ఆటలో న్యూజిలాండ్‌ చివరి వికెట్‌ కాపాడుకొని మ్యాచ్‌ను డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇన్నింగ్స్‌ 81వ ఓవర్‌ పూర్తయ్యాక టీమ్ఇండియా కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా నాలుగు ఓవర్లు ఆలస్యంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. తర్వాత జడేజా కొత్త బంతితో రెండు వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలోనే రెండు వరుస ట్వీట్లు చేసిన షేన్‌వార్న్‌ భారత జట్టు ఆలోచనా విధానాలు తనను చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పాడు. ‘భారత జట్టు కొత్త బంతిని తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలేదు. ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. వెలుతురు సరిగ్గా లేని పరిస్థితుల్లో, ఓవర్లు పూర్తవుతున్న క్రమంలోనూ పాత బంతితోనే బౌలింగ్‌ చేస్తోంది. ఇది విచిత్రంగా ఉంది’ అంటూ మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక పోస్టు చేశాడు. కాసేపటికే మరో ట్వీట్‌లో..‘ముందే కొత్త బంతి తీసుకునే అవకాశం ఉన్నా.. అదే పాత బంతితో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయడం ఈ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారేదా..? న్యూజిలాండ్‌ వెనుకపడేదా? లేక ఇండియా గెలిచేదా?’ అని తన సందేహాలను వెలిబుచ్చాడు. కాగా, టీమ్‌ఇండియా ఆఖరి క్షణాల్లో ఒక్క వికెట్‌ తీసేందుకు తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని