IND vs NZ: అర్ధశతకంతో మెరిసిన శ్రేయస్‌.. టీ విరామానికి ముందు ఔట్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన శ్రేయస్‌ అయ్యర్‌ (65; 125 బంతుల్లో 8x4, 1x6) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో రాణించాడు...

Updated : 28 Nov 2021 14:37 IST

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శతకంతో మెరిసిన శ్రేయస్‌ అయ్యర్‌ (65; 125 బంతుల్లో 8x4, 1x6) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు రవిచంద్రన్‌ అశ్విన్‌ (32; 62 బంతుల్లో 5x4), వృద్ధిమాన్‌ సాహా (22 నాటౌట్‌; 69 బంతుల్లో 1x4, 1x6)లతో అర్ధశతక భాగస్వామ్యాలు జోడించాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి 167/7తో నిలిచింది. ఈ క్రమంలోనే భారత్‌ మొత్తం ఆధిక్యం 216 పరుగులుగా నమోదైంది. 84/5తో రెండో సెషన్‌లో బ్యాటింగ్‌ ఆరంభించిన అయ్యర్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా, టిమ్‌సౌథీ వేసిన ఇన్నింగ్స్‌ 60.2 ఓవర్‌కు వికెట్ల వెనుక కీపర్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు అశ్విన్‌.. జేమీసన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకొని అతడి కాలికి తగిలి వికెట్లకు తాకడంతో బెయిల్స్‌ కిందపడ్డాయి. దీంతో అశ్విన్‌ 103 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ సెషన్‌లో భారత్‌ 83 పరుగులు సాధించి రెండు వికెట్లు కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని