
IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన టీమ్‌ఇండియా
టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసిన కివీస్ బౌలర్లు
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో పూర్తిగా తేలిపోయింది. 14/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు భోజన విరామ సమయానికి 84/5తో నిలిచింది. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. కైల్ జేమీసన్ 2/21, టిమ్‌సౌథీ 2/27, అజాజ్ పటేల్ 1/29 రాణించడంతో భారత్ కష్టాల్లోపడింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ (18), రవిచంద్రన్ అశ్విన్ (20) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 74 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ప్రస్తుత ఆధిక్యం 133 పరుగులుగా నమోదైంది.
ఉదయం వేళ మయాంక్ (17), పుజారా (22) ఇన్నింగ్స్ బాగానే ఆరంభించినా జేమీసన్ వీరిని విడదీశాడు. ఓ షార్ట్‌పిచ్ బంతితో పుజారాను బుట్టలో వేసుకోవడంతో న్యూజిలాండ్ వికెట్ల వేట ప్రారంభించింది. అనంతరం కెప్టెన్ రహానె (4)ను అజాజ్ పటేల్ ఔట్ చేయగా.. టిమ్‌సౌథీ ఒకే ఓవర్‌లో మయాంక్, రవీంద్ర జడేజా (0)ను పెవిలియన్ పంపాడు. దీంతో భారత్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన శ్రేయస్, అశ్విన్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఆశలన్నీ వీరిద్దరిపైనే ఉన్నాయి. రెండో సెషన్‌లో ఎలా ఆడతారో చూడాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.