
IND vs NZ: 400కిపైగా ఆధిక్యంలో దూసుకుపోతున్న టీమ్‌ఇండియా
మూడో రోజు తొలి సెషన్ పూర్తి.. అజాజ్‌కే మరో రెండు వికెట్లు
ఇంటర్నెట్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా 405 పరుగుల ఆధిక్యంతో దూసుకుపోతోంది. 69/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన మయాంక్ అగర్వాల్ (62; 108 బంతుల్లో 9x4, 1x6), ఛెతేశ్వర్ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం (107) నెలకొల్పగా.. అజాజ్ పటేల్ స్వల్ప వ్యవధిలో వీరిదర్నీ మరోసారి పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్ 36 ఓవర్లకు 115/2 స్కోర్‌తో నిలిచింది. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన శుభ్‌మన్ గిల్ (17), కెప్టెన్ విరాట్ కోహ్లీ (11) నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.