Virat Kohli: కోహ్లి.. ఔటా? నాటౌటా..?

టీ20 ప్రపంచకప్‌ అనంతరం కివీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు విరామం తీసుకుని మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. రెండో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా...

Updated : 07 Dec 2021 14:14 IST

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ అనంతరం కివీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు విరామం తీసుకుని మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. రెండో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఔటయ్యాక క్రీజులో అడుగుపెట్టిన కోహ్లి తాను ఎదుర్కొన్న నాలుగో బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అతన్ని ఔట్‌గా ప్రకటించడంపై వివాదం రాజుకుంది. అజాజ్‌ బంతిని డిఫెన్స్‌ ఆడదామని కోహ్లి ప్రయత్నించాడు. కానీ బంతి ప్యాడును తాకిందని అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. బంతి ముందుగా బ్యాట్‌ను ముద్దాడిందని బలంగా నమ్మిన కోహ్లి వెంటనే సమీక్ష కోరాడు. రీప్లేలో బంతి బ్యాట్‌ను, ప్యాడ్‌ను దాదాపు ఒకేసారి తాకినట్లు కనిపించింది. కానీ ముందుగా బ్యాట్‌కే తగిలిందనడానికి సరైన ఆధారాలు లేవంటూ మూడో అంపైర్‌ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేశాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అతను.. అంపైర్‌తో మాట్లాడి అసహనంతో పెవిలియన్‌ చేరాడు. దీంతో కోహ్లి నాటౌట్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ కూడా నాటౌట్‌ అని పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని