Updated : 02/12/2021 15:22 IST

IND vs NZ: కోహ్లీ, ద్రవిడ్‌ సరైన నిర్ణయమే తీసుకుంటారు: లక్ష్మణ్

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ రెండో టెస్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ను కొనసాగించాలని, వారు అతడిని విస్మరించకూడదని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన కాన్పూర్‌ టెస్టులో శ్రేయస్‌ అదరగొట్టిన సంగతి తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (105, 65) శతకం, అర్ధశతకాలు సాధించి అందర్నీ ఆకట్టుకున్నాడని లక్ష్మణ్‌ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్‌ను రెండో టెస్టులోనూ కొనసాగించాలని సూచించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో టెస్టులో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో లక్ష్మణ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు తొలి టెస్టులో ఓపెనర్‌గా ఆడిన మయాంక్‌ అగర్వాల్‌ విఫలమయ్యాడని, అతడిది దారుణమైన ఆట అని విమర్శించాడు. మయాంక్‌ క్రీజులో ఇబ్బంది పడుతున్నాడని పేర్కొన్నాడు. దీంతో మయాంక్‌ బదులు పుజారాను ఓపెనర్‌గా పంపాలని వీవీఎస్‌ సలహా ఇచ్చాడు. రహానె మూడో స్థానంలో, కోహ్లీ నాలుగు, శ్రేయస్‌ ఐదో స్థానంలో బరిలోకి దిగాలని అభిప్రాయపడ్డాడు. శ్రేయస్‌ను విస్మరించడం కఠిన నిర్ణయం అవుతుందని, రాహుల్‌ ద్రవిడ్‌, విరాట్‌ కోహ్లీ అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరూ సరైన నిర్ణయమే తీసుకుంటారని తెలిపాడు. అనంతరం కోహ్లీ బ్యాటింగ్‌పై స్పందించిన వీవీఎస్‌.. రెండో టెస్టులో అతడి బ్యాటింగ్‌ వీక్షించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. కోహ్లీ తన స్థాయికి తగ్గట్టు ఆడితే ప్రపంచంలో ఏ బౌలింగ్‌ దళాన్నైనా తుత్తునియలు చేస్తాడన్నాడు. అతడు శతకం బాది చాలా కాలమైన నేపథ్యంలో రెండో టెస్టులో ఆ లోటు తీరిస్తే చూడాలని ఉందన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని