Updated : 30/11/2021 07:50 IST

IND vs NZ: పిచ్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు.. కానీ..: రాహుల్‌ ద్రవిడ్‌

కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా విశ్వప్రయత్నం చేసినా మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఐదోరోజు చివరి సెషన్‌లో వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను 10-15 నిమిషాల ముందుగానే నిలిపివేశారు. అప్పటికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 165/9 స్కోర్‌తో ఓటమి అంచున నిలిచింది. రచిన్‌ రవీంద్ర (18; 91 బంతుల్లో 2x4), అజాజ్‌ పటేల్‌ (2; 23 బంతుల్లో) చివరి వరకూ క్రీజులో నిల్చొని మ్యాచ్‌ను కాపాడుకున్నారు. టీమ్‌ఇండియా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని ఔట్‌చేసినా మ్యాచ్‌ సొంతమయ్యేది. కానీ, గొప్పగా పోరాడిన కివీస్‌ ఆటగాళ్లు ఓటమిపాలవ్వకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో టీమ్‌ఇండియా గెలవాల్సిన మ్యాచ్‌ చివరికి డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన భారత హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ బౌలర్ల శ్రమను మెచ్చుకున్నాడు. చివరిరోజు పిచ్‌ నుంచి ఏమాత్రం స్పందన లేకపోయినా 8 వికెట్లు తీశారని గుర్తుచేశాడు. కఠిన పరిస్థితుల్లోనూ గెలిచేంత పని చేశారన్నాడు.

‘‘చివరి సెషన్లో భారత జట్టు గొప్ప సంయమనం, పోరాట తత్వం చూపించింది. అయిదో రోజు పిచ్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు. లంచ్‌ తర్వాత ఎనిమిది వికెట్లు పడగొట్టారంటే అది గొప్ప ప్రయత్నం వల్లే. కాస్త అదృష్టం కలిసొస్తే మ్యాచ్‌ భారత్‌ సొంతమయ్యేది. కానీ మన ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. ఈ పిచ్‌పై బంతి మరీ నెమ్మదిగా, తక్కువ ఎత్తులో వచ్చింది. బౌన్స్‌ కానీ, టర్న్‌ కానీ కాలేదు. భారత పరిస్థితుల్లో మామూలుగా చివరి రోజు పిచ్‌లో పగుళ్లు వస్తాయి. స్పిన్నర్లు ఇన్‌ సైడ్‌, ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌లతో వికెట్లు రాబడతారు. కానీ కాన్పూర్‌లో అందుకు అవకాశమే లేకపోయింది. ఇలాంటి స్థితిలోనూ మా జట్టు 8 వికెట్లు పడగొట్టింది. తర్వాతి మ్యాచ్‌కు మా తుది జట్టు గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ముందు ముంబయికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించాలి. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ చూసుకోవాలి. కోహ్లి మాతో కలుస్తాడు. తనతో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం’’ అని ద్రవిడ్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని