WTC Points Table: అగ్రస్థానాల్లో భారత్‌, పాక్‌..  కోత లేకుంటే పటిష్ఠంగా  కోహ్లీ సేన

ఐసీసీ (ICC) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా (Team India) 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌ (Pakistan) 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Published : 26 Aug 2021 01:24 IST

దుబాయ్: ఐసీసీ (ICC) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) పాయింట్ల పట్టికలో దాయాది దేశాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టీమ్‌ఇండియా (Team India) 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్‌ (Pakistan) 12 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఇంగ్లాండ్‌తో ఇప్పటివరకు కోహ్లీ సేన (Kohli Team) రెండు టెస్టులు ఆడింది. తొలి టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో రెండు జట్లకు చెరో 4 పాయింట్లు వచ్చాయి. లార్డ్స్‌ టెస్టు విజయంతో భారత్‌కు 12 పాయింట్లు వచ్చాయి. అయితే నాటింగ్‌హామ్‌లో నిర్దేశించిన సమయంలోగా రెండు ఓవర్లు వేయనందుకు రెండు జట్లకు రెండు పాయింట్ల మేర కోత విధించారు. దాంతో కోహ్లీసేన ఖాతాలో 16కు బదులు 14 పాయింట్లే ఉన్నాయి.

ఇక పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ తలపడ్డ సిరీసులో రెండు జట్లు చెరో విజయం సాధించాయి. దాంతో రెండు జట్ల ఖాతాల్లో 12 పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్, విజయాల ఆధారంగా రెండో స్థానంలో పాక్‌, మూడో స్థానంలో విండీస్‌ నిలిచాయి. ఇక రెండు పాయింట్లతో ఇంగ్లాండ్‌ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌, భారత్‌.. హెడింగ్లేలో మూడో టెస్టు ఆడుతున్నాయి. ఈ మ్యాచును బట్టి పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని