Updated : 05/09/2021 17:49 IST

IND vs ENG: మెరిసిన ఇంగ్లాండ్‌.. ఆశలన్నీ పంత్‌, శార్దూల్‌పైనే!

తొలి సెషన్‌లో భారత్‌ మూడు వికెట్లు డౌన్‌

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది. 270/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆదివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. భోజన విరామసమయానికి స్కోరు బోర్డుకు 59 పరుగులు  జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (17), అజింక్య రహానె (0), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44) ఔటయ్యారు. ప్రస్తుతం పంత్‌ (16), శార్దూల్‌ ఠాకూర్‌ (11) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ ఎదుట భారీ లక్ష్యం ఉంచాలంటే వీరిద్దరూ రాణించాల్సిందే. 

కోహ్లీ, జడ్డూ @ 59

తొలుత కోహ్లీ, జడేజా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నా... క్రిస్‌ వోక్స్‌ స్వల్పవ్యవధిలో భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. కోహ్లీ, జడ్డూ నాలుగో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యంతో కొనసాగుతుండగా వోక్స్‌ వచ్చాడు. తొలుత జడేజాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే రహానె (0)ను ఔట్‌ చేశాడు. దాంతో భారత్‌ 296 పరుగుల వద్ద కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. మరోవైపు నిలకడగా ఆడుతూ అర్ధశతకానికి చేరువైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో స్లిప్‌లో దొరికిపోయాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకొని ఓవర్టన్‌ చేతిలో పడింది. దీంతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆపై పంత్‌, శార్దూల్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 329/6గా నమోదైంది. ఆధిక్యం 230కి చేరింది. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని