Published : 16/08/2021 10:20 IST

India vs England: గోడలా నిలబడ్డ రహానె, పుజారా.. హైలైట్స్‌ చూస్తారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య రెండో టెస్టు రోజులు గడిచేకొద్దీ ఉత్కంఠకరంగా మారుతోంది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండటంతో ఆటగాళ్లు ఒకరినొకరు కవ్వించుకొనేందుకూ వెనుకాడటం లేదు. మూడోరోజు బుమ్రాను దూషించిన అండర్సన్‌ నాలుగో రోజైన ఆదివారం విరాట్‌ కోహ్లీనీ మాటలన్నాడు. దాంతో విరాట్‌ సైతం అతడికి ఘాటుగానే బదులిచ్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 364 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ 391 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. చెతేశ్వర్‌ పుజారా (45; 206 బంతుల్లో 4×4), అజింక్య రహానె (61; 146 బంతుల్లో 5×4) జట్టును ఆదుకున్నారు. రిషభ్ పంత్‌ (14* బ్యాటింగ్‌), ఇషాంత్‌ శర్మ (4* బ్యాటింగ్‌) అజేయంగా నిలిచారు. సోమవారం ఏం జరగనుందన్నది ఆసక్తికరం!!

నాలుగో రోజు ఆట హైలైట్స్‌ మీకోసం..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని