INDvsENG: భారత్ చేసినట్టే మేం చేస్తే.. వాళ్లకు అభ్యంతరం ఉండదనుకుంటా..
టీమ్‌ఇండియాతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్.. క్రికెట్ పిచ్‌లను తమకు అనుకూలంగా తయారుచేసినా ‘కోహ్లీసేన’ అభ్యంతరం వ్యక్తం చేయదని సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు...
నాటింగ్‌హామ్: టీమ్‌ఇండియాతో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్.. క్రికెట్ పిచ్‌లను తమకు అనుకూలంగా తయారుచేసినా ‘కోహ్లీసేన’ అభ్యంతరం వ్యక్తం చేయదని సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. తాజాగా అతడు మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఫిబ్రవరి, మార్చిలో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేశారని, దాంతో తాము ఆతిథ్య జట్టు ఉచ్చులో పడిపోయామని ఇంగ్లాండ్ పేసర్ అభిప్రాయపడ్డాడు. అదే వరుసలో ఇప్పుడు తాము కూడా హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశాడు.
ప్రపంచంలో ప్రతి జట్టూ తమకు అనుకూలంగా ఉండే పిచ్‌లు తయారు చేయించుకుంటుందని, అది తప్పు కాదని అండర్సన్ అన్నాడు. ఈ క్రమంలోనే రాబోయే టెస్టు సిరీస్‌లో పిచ్‌లపై పచ్చిక ఉన్నా భారత జట్టూ తమ పేస్‌దళంతో బరిలోకి దిగాలని సూచించాడు. దాంతో ఈ పిచ్‌లను పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉండేలా కావాలనుకుంటున్నట్లు తెలిపాడు. అనంతరం ఐపీఎల్‌పై స్పందించిన ఇంగ్లాండ్ పేసర్.. తన కెరీర్‌లో ఎంతో మంది యువ ఆటగాళ్లను చూశానని, ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆడిన ఆటగాళ్లను చూడటం అద్భుతంగా ఉందన్నాడు. ఆ మెగా టీ20 లీగ్ ద్వారా ఆటగాళ్లలో దూకుడు పెరిగిందన్నాడు. అందుకు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ రిషభ్‌పంతే సరైన ఉదాహరణ అని వివరించాడు.
ఈ యువకులు ఎలాంటి ఫార్మాట్లో అయినా, ఎలాంటి షాట్లు అయినా ఆడగలుగుతారని మెచ్చుకున్నాడు. వాటిని చూడటం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. అది బౌలర్లకూ సవాళ్లతో కూడుకున్నదని చెప్పాడు. చివరగా టీమ్‌ఇండియా ఆటగాళ్లపై స్పందిస్తూ.. ఈ జట్టులో ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని చెప్పాడు. అందులో ప్రతి ఒక్కరూ బాగా ఆడతారని అండర్సన్ గుర్తుచేశాడు. అందరిలోనూ కెప్టెన్ విరాట్‌కోహ్లీ వికెట్ ఇంకా ప్రత్యేకమని తెలిపాడు. అతడు జట్టుపై ప్రభావం చూపుతాడన్నాడు. అలాగే పుజారా కూడా క్రీజులో పాతుకుపోతే వికెట్ తీయడం కష్టమని అంచనా వేశాడు. దాంతో టీమ్‌ఇండియా జట్టులో ఎవరినీ తక్కువ చేయొద్దని వివరించాడు. ఎవరికి వారు భిన్నమైన ఆటగాళ్లని, ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళికలు రూపొందించి మరీ వికెట్లు తీయాలన్నాడు. కాగా, అండర్సన్ ఇప్పటివరకు 162 టెస్టులాడి 617 వికెట్లు తీశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
India News
సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..