INDvsENG: రాణించిన రోహిత్, రాహుల్.. మరోసారి పుజారా విఫలం
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా రెండో సెషన్ పూర్తి చేసుకుంది. తొలి సెషన్లో 46/0తో నిలిచిన కోహ్లీసేన రెండో సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి మరో 111 పరుగులు చేసింది...
లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా రెండో సెషన్ పూర్తి చేసుకుంది. తొలి సెషన్లో 46/0తో నిలిచిన కోహ్లీసేన రెండో సెషన్లో రెండు వికెట్లు కోల్పోయి మరో 111 పరుగులు చేసింది. దాంతో మొత్తం 52 ఓవర్లకు 157/2తో పటిష్టస్థితిలో నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ(83; 145 బంతుల్లో 11x4, 1x6) ఔటైనా కేఎల్ రాహుల్ (55 నాటౌట్; 143 బంతుల్లో 3x4, 1x6) అర్ధశతకంతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా(9; 23 బంతుల్లో 1x4) మరోసారి నిరాశపరిచాడు. దాంతో భారత్ 150 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా మరో వికెట్ పడకుండా భారత్ రెండో సెషన్ ముగించింది. కాగా, ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతాను రాజస్థాన్ చివరి బంతికి ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో జోస్ బట్లర్ సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. -
బాప్రే బట్లర్.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్
ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్‌పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్‌కతాతో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్ ఓపెనర్ బట్లర్‌కు సహకరించే వారూ లేరు. -
జ్యోతి వెలిగింది.. పారిస్ మురిసింది
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్‌లో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. -
టీ20 ప్రపంచకప్‌లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తేనే..
రాబోయే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్య ఆడతాడా? ఐపీఎల్లో ఇప్పటిదాకా ఈ ఆల్‌రౌండర్ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడుతుందని అంతా అనుకున్నారు. -
ఐపీఎల్‌కు మ్యాక్స్‌వెల్ నిరవధిక విరామం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. -
నాదల్ విజయంతో..
స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ పునరాగమనాన్ని విజయంతో మొదలుపెట్టాడు. బార్సిలోనా ఓపెన్ తొలి రౌండ్లో అతడు 6-2, 6-3తో ఫ్లావియో కొబాలి (ఇటలీ)పై విజయం సాధించాడు. -
అగ్రస్థానంలో గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నెపోమ్నియాషి (రష్యా)తో జరిగిన పదో రౌండ్ గేమ్‌ను అతడు డ్రాగా ముగించాడు. -
రోహిత్ ఓటమి
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ దహియా పోరాటం ముగిసింది. మంగళవారం 82 కేజీల విభాగం కాంస్య పోరులో ఈ భారత కుర్రాడు 1-3తో రసులోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు. -
నరైన్ శతకం వృథా.. సెంచరీ చేసి రాజస్థాన్‌ను గెలిపించిన బట్లర్
కోల్‌కతాపై రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 224 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. ఆ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ శతకం(107*)తో చెలరేగాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఉదయనిధి బ్యానర్‌తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
-
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్‌తో అలరించిన రణ్వీర్ సింగ్
-
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద