
IPL 2021: కోహ్లీ కప్పు సాధించకపోయినా.. ఆర్సీబీని ఒక బ్రాండ్‌గా నిలబెట్టాడు
ఇంటర్నెట్‌డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా విరాట్ కోహ్లీ ఒక్కసారీ టైటిల్ సాధించకపోయినా ఆ జట్టును ఒక బ్రాండ్‌గా నిలబెట్టాడని అభిమానులు భావోద్వేగం చెందారు. ఆర్సీబీ గతరాత్రి కోల్‌కతాతో తలపడిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు మరోసారి కప్పు కలను నెరవేర్చుకోకుండానే నిష్క్రమించింది. మరోవైపు కోహ్లీ ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న నేపథ్యంలో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. భావోద్వేగపూరిత పోస్టులు పెడుతూ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘కోహ్లీని ఎవరైనా అభిమానించినా, ద్వేషించినా పర్లేదు.. కానీ, అతడు బాధపడుతుంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అతడి సారథ్యంలో బెంగళూరు టైటిల్ సాధించకపోయినా విరాట్ వల్లే ఆ జట్టుకు అత్యధిక మంది అభిమానులు ఉన్నారు. ఇది ఒక శకానికి ముగింపు’ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఇంకా ఎలాంటి పోస్టులు పెట్టారో మీరే చూడండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.