
IPL 2021: ఐపీఎల్ నియమావళి ఉల్లంఘన.. దినేశ్ కార్తీక్‌కు మందలింపు
ఇంటర్నెట్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ మందలింపునకు గురయ్యాడు. అతడు ఐపీఎల్ నియమావళి ఉల్లంఘించాడని పేర్కొంటూ టోర్నీ నిర్వహకులు బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అందులో అతడేం చేశాడ విషయం మాత్రం వెల్లడించలేదు. గతరాత్రి దిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడిన సందర్భంగా కార్తీక్ (0) ఛేదనలో డకౌటైనప్పుడు తన కోపాన్ని వికెట్లపై చూపించాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కింద తప్పు చేసినట్లు ఆంగీకరించాడని నిర్వహకులు తెలిపారు. అతడిపై మ్యాచ్ రిఫరీ తీసుకునే చర్యలు అంతిమం అని అందులో పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా మొదట తెలిగ్గా ఛేదించేలా కనిపించింది. 16 ఓవర్లకు 123/2 స్కోర్‌తో నిలిచి విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి శుభ్‌మన్ గిల్ (45), రాహుల్ త్రిపాఠి క్రీజులో ఉన్నారు. ఇక తర్వాత అవేశ్‌ఖాన్, రబాడ, నార్జె తర్వాతి మూడు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులేసి 6 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశారు. గిల్(46), కార్తీక్ (0), మోర్గాన్ (0) ఔటయ్యారు. చివరి ఓవర్‌లో అశ్విన్ షకిబ్ (0), నరైన్ (0)ను కూడా పెవిలియన్ చేరడంతో ఆఖరి రెండు బంతుల్లో కోల్‌కతా విజయానికి 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే ఐదో బంతిని రాహుల్ త్రిపాఠి (12) స్టాండ్స్‌లోకి తరలించి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ క్రమంలోనే కార్తీక్ ఔటైనప్పుడు వికెట్లను తీసి పారేశాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.