IPL 2021: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. రెండో దశలో రెండు జట్లూ ముంబయి, బెంగళూరు జట్లను ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి...

Updated : 26 Sep 2021 15:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరికాసేపట్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. రెండో దశలో రెండు జట్లూ ముంబయి, బెంగళూరు జట్లను ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. అయితే, మరికాసేపట్లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, ఇరు జట్లూ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉండటంతో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది.

కోల్‌కతా జట్టు: వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌గిల్‌, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, లాకీ ఫెర్గూసన్‌, వరుణ్‌ చక్రవర్తి, ప్రసిద్ధ్‌ కృష్ణ

చెన్నై జట్టు: డుప్లెసిస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, సామ్‌ కరణ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, జోష్‌ హేజిల్‌వుడ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని