IPL 2021: మేం ఒప్పుకొంటాం : రోహిత్‌..  ఒత్తిడి తట్టుకోలేకపోయాం : రాహుల్‌

ముంబయి ఇండియన్స్‌ మళ్లీ గెలుపు రుచి చూసింది. మంగళవారం రాత్రి పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య...

Published : 29 Sep 2021 11:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ మళ్లీ గెలుపు రుచి చూసింది. మంగళవారం రాత్రి పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడాడు.

‘ఈ సీజన్‌లో మా శక్తిమేరా రాణించలేదని ఒప్పుకొంటాం. ఇది అతిపెద్ద టోర్నీ. ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆత్వివిశ్వాసం పెరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ ఆడిన తీరు, పరిస్థితులను అర్థం చేసుకున్న విధానం జట్టు కోణంలో ముఖ్యమైనవి. సౌరభ్‌ తివారి కూడా బాగా ఆడాడు. ఇద్దరూ క్రీజులో నిలబడటం ఎంతో అవసరం. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం కఠిన నిర్ణయమే అయినా సానుకూలంగా ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో రాణిస్తాడనే నమ్మకం అతడికి ఉంది. అతడు మాకు ముఖ్యమైన ఆటగాడు.. జట్టు యాజమాన్యం అండగా ఉంటుంది’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం: రాహుల్‌

ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో బాగా ఆడినా తాము సాధించిన స్కోర్‌ 135 తక్కువేనని చెప్పాడు. ఈ పిచ్‌పై 170 పరుగులు చేయాల్సి ఉందన్నాడు. బౌలింగ్‌లో తమ ఆటగాళ్లు ఆకట్టుకున్నా బ్యాటింగ్‌లో విఫలమయ్యారన్నాడు. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అలాగే పాయింట్ల పట్టిక కూడా ఆసక్తికరంగా ఉందని, మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించేందుకు కృషి చేస్తామన్నాడు. అలాగే తాము ఒత్తిడి తట్టుకోలేకపోతున్నట్లు రాహుల్‌ పేర్కొన్నాడు. ఓటములు ఎదురైనా సానుకూలంగా ఆలోచించాలని, మిగిలిన మ్యాచ్‌లపై దృష్టి సారిస్తామని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని